Share this story
ఎట్టకేలకు ఈ 14 వ ఎడిషన్ మెన్స్ హాకీ ప్రపంచ కప్ లో పూల్ దశ ముగిసింది. పదహారు దేశాల హాకీ టీం ల మధ్య జరిగిన ఎంతో ఉత్కంఠ భరిత మైన మ్యాచ్ లు, అద్బుతమైన ఆట ప్రదర్శన లను ఈ పూల్ దశలో మనం చూసాం. అన్నింటి కన్నా ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే ఈ పద్నాలుగవ ఎడిషన్ లో మన భారత దేశ హాకీ ఆటగాళ్ళు అద్భుతంగా ఆడి డైరెక్ట్ ఎంట్రీ ద్వారా క్వార్టర్ ఫైనల్ దశకి చేరుకున్నారు.
అయితే మన హాకీ టీం కి నెథర్లాండ్స్ లేకపోతే కెనడా ద్వారా క్వార్టర్ ఫైనల్ దశలో పెద్ద ప్రమాదమే పొంచి ఉంది. క్వార్టర్ ఫైనల్ దశలో కూడా మన హాకీ ఆటగాళ్లు ఇరగదీస్తే ఇక ఈ వరల్డ్ కప్ లో మన దేశంకి తిరుగే ఉండదు. మొత్తానికి అయితే భువనేశ్వర్ లోని కళింగ స్టేడియం లో చివరి పూల్ స్టేజి మ్యాచ్ ఈ ఆదివారం నాడు కొంచెం ఉత్కంఠ భరితంగా సాగి ముగిసింది.
చివరి రెండు పూల్ దశ మ్యాచ్ లలో భాగంగా జర్మనీ జట్టు మలేషియా హాకీ టీం తో తలపడగా, నెథర్లాండ్స్ జట్టు పాకిస్తాన్ జట్టు ను ఎదుర్కొంది. ఆట ముగిసే నాటికి, జర్మనీ ఆటగాళ్లు ఎంతో కసితో ఆడి ఒక అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి మలేషియా జట్టు ను 5-3 తేడాతో చిత్తుగా ఓడించారు.
అయితే, ఈ మ్యాచ్ లో బాగానే ఆడినట్లు కనిపించిన మలేషియా జట్టు జర్మనీ ఆటగాళ్ల ప్రదర్శ ముందు తేలిపోయింది. చివరకు మలేషియా ఇంటి ముఖం పట్టాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా, పూల్ డి గ్రూప్ లో జరిగిన చివరి మ్యాచ్ లో నెథర్లాండ్స్ జట్టు పాకిస్తాన్ హాకీ జట్టు ను చిత్తు చిత్తుగా ఓడించి 5-1 తేడాతో ఒక అద్భుతమైన విజయాన్ని తన ఖాతా లో వేసుకుంది.
క్వార్టర్ ఫైనల్ దశలో పన్నెండు జట్లు తలపడాల్సి ఉండగా, ఆ పన్నెండు లో నాలుగు జట్లు ఏంటో మనకు తెలిసిపోయింది. ఇప్పుడు మిగతా నాలుగు స్థానాల కోసం మిగతా ఎనిమిది జట్లు తలపడనున్నాయి. ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఫ్రాన్స్, చైనా, బెల్జియం, పాకిస్తాన్, నెథర్లాండ్స్, కెనడా దేశాల జట్లు తమ తమ అదృష్టాన్ని పరీక్షించు కోనున్నారు
షెడ్యూల్:
1. ఇంగ్లాండ్ vs న్యూజిలాండ్ – డిసెంబర్ 10వ తేదీ 16:45 IST
2. ఫ్రాన్స్ vs చైనా – డిసెంబర్ 10వ తేదీ 19:00 IST
3. బెల్జియం vs పాకిస్తాన్ – డిసెంబర్ 11వ తేదీ 16:45 IST
4. నెథర్లాండ్స్ vs కెనడా – డిసెంబర్ 11వైస్ తేదీ 19:00 IST