వెస్టిండీస్ జట్టు భారత పర్యటన షెడ్యూల్ ఇదే!

కరేబియన్ జట్టు భారత పర్యటన వివరాలను వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్ ప్రకటించింది. ఈ సందర్భంగా 15 మందితో జట్టును కూడా సెలక్టర్లు ప్రకటించారు. అక్టోబర్ 4 నుంచి వెస్టిండీస్ జట్టు భారత గడ్డ మీద రెండు టెస్టులు, ఐదు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. సెప్టెంబర్ 28న ఆసియా కప్ ఫైనల్ జరగనుండగా.. ఆ వెంటనే భారత జట్టు సొంత గడ్డ మీద వెస్టిండీస్‌తో తలపడనుంది. తొలి టెస్టు మ్యాచ్‌కు రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదిక కానుంది. తర్వాతి టెస్టుకు హైదరాబాద్‌ ఆతిథ్యం ఇవ్వనుంది.

టెస్టు జట్టు: జాసన్ హోల్డర్ (కెప్టెన్), సునీల్ ఆంబ్రిస్, దేవేంద్ర బిషూ, బ్రాత్‌వైట్, రోస్టన్ ఛేజ్, షేన్ డోరిచ్, షన్నాన్ గ్రాబియెల్, జహ్మీర్ హమిల్టన్, షిమ్రాన్ హెట్మెర్, షాయ్ హోప్, అల్జరీ జోసెఫ్, కీమో పాల్, కీరన్ పావెల్, కెమెర్ రోచ్, జోమెల్ వరికన్.