WWE రా (RAW) ఫలితాలు: ఇంటర్ కాంటినెంటల్ టైటిల్ ని తిరిగి సొంతం చేసుకున్న సేథ్ రోలిన్స్, జనరల్ మేనేజర్ గా ఎన్నికైనట్లు ప్రకటించుకున్న బారన్ కార్బిన్

Share this storyసోమవారం సాయంత్రం జరిగిన రా (RAW) మ్యాచ్ పెను దుమారం సృష్టిస్తోంది. ఆ మ్యాచ్ ని అందరు 2018 లోనే అత్యంత చెత్త రా మ్యాచ్ గా అభివర్ణిస్తున్నారు. మ్యాచ్ లో బారన్ కార్బిన్ తనదైన శైలిలో పిచ్చి గా వ్యవహరిస్తూ చాలానే గొప్పలకు పోయాడు. ఏకంగా తనని తాను జనరల్ మేనేజర్ గా ప్రకటించుకున్నాడు. మొత్తం మ్యాచ్ లో కలగా చేసుకోవడమే కాకుండా, బాబీ లాషులేయ్ ఎలియాస్ ని ఓడించేలా సాయపడ్డాడు.ఇదిలా ఉండగా బారన్ మరింత రెచ్చిపోయి డ్రూ మెక్లీన్టర్ మరియు ఫిన్ బలోర్ మధ్య జరుగుతున్న హ్యాండీక్యాప్ మ్యాచ్ లో వేలు పెట్టాడు. బ్రౌన్ స్ట్రౌమాన్ మోచేతి గాయం తో హాస్పిటల్ లో చికిత్స పొందుతుండడంతో, బారన్ కార్బిన్ తనకి ఇక అడ్డే లేదు అన్నట్లుగా వ్యవహరించి, ఆ మ్యాచ్ లో డ్రూ మెక్లీన్టర్ కి సాయపడి ఫిన్ బలోర్ ని ఇంటికి పంపించేశాడు.

బారన్ కార్బిన్ తన యొక్క జనరల్ మేనేజర్ పదవిని ఉపయోగించి రా (RAW) ఉమెన్స్ డివిజన్ కి అలెక్సా బ్లిస్ ని ఇంచార్జి గా నియమించాడు. సాషా బ్యాంక్స్ మరియు బేలేయ్ తో కలిసి అలెక్సా బ్లిస్ ఒక ఓపెన్ ఫోరమ్ లో పాల్గొని తన యొక్క పదవీ కాలాన్ని ప్రారంభించింది.

అలెక్సా బ్లిస్, సాషా బ్యాంక్స్ మరియు బేలేయ్ ని కలిపి మొదలు పెట్టిన మ్యాచ్ లో వారు ఇరువురు మిక్కీ జేమ్స్, అలీసియా ఫాక్స్, ఇంకా డానా బ్రూక్ తో తలపడ్డారు. ఈ మ్యాచ్ ని అలెక్సా బ్లిస్ తన యొక్క ఫస్ట్ యాక్ట్ అఫ్ బిజినెస్ లో భాగంగా ప్రారంభించగా సాషా మరియు బేలేయ్ జంట ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ కూడా ప్రేక్షకులని ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయింది.

ఈ మ్యాచ్ సంగతి పక్కన పెడితే, నియా జాక్స్ కొంచెం హంగామా సృష్టించింది. తను రా (RAW) ఉమెన్స్ ఛాంపియన్ అయినటువంటి రొండా రౌసి తో గొడవపడి కొత్త డ్రామాకు తెరలేపింది. ఇదంతా గమనించిన రియాట్ స్క్వాడ్ వారి మధ్య కలగ చేస్కుని సర్ది చెప్పారు. ప్రేక్షకుల చేతిలో చివరకు నియా నే నవ్వుల పాలైంది.

ఇదంతా గమనిస్తున్న ప్రజలకు వీరి వెకిలి చేష్టలు నచ్చక ట్విట్టర్ లో వారి కోపాన్ని వెలిబుచ్చారు.

మొత్తానికి, సోమవారం జరిగిన రా లో అద్భుతమైన ప్రదర్శన చేసి సేథ్ రోలిన్స్ అందరి మన్నన లను పొందాడు. సేథ్ ఇంటర్ కాంటినెంటల్ మ్యాచ్ లో భాగంగా డాల్ఫ్ జిగ్లర్ తో పోటీ పడ్డాడు. అయితే డీన్ అంబ్రోస్ యొక్క అతి తెలివి సేథ్ ముందు తేలిపోయింది. అంబ్రోస్ తనని ఓడగొట్టడానికి ఎంత ప్రయత్నించినా కూడా సేథ్ మాత్రం ఏ మాత్రం తడబడ కుండ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ షిప్ ని తన సొంతం చేసుకున్నాడు.

ఈ ఉత్కంఠంగా పోరులో జిగ్లర్ మొదట్లో తన ఆటను బాగానే ప్రారంభించాడు. అయితే తను ఏమర పాటులో సేథ్ రోలిన్స్ కి కోలుకోవడానికి వీలుగా చాలానే టైం ఇవ్వడంతో మొదటికే మోసం వచ్చింది. దీన్ని అదునుగా చుసిన సేథ్, మంచి టైమింగ్ తో ఆతని తన చేతుల్లోకి తీస్కొని విజేతగా నిలిచాడు.