Share this story
అయితే, ఇందులో గొప్ప విశేషం ఏంటంటే, మన కెప్టెన్ అయిన సునీల్ ఛెత్రి మరియు గురుప్రీత్ సింగ్ తప్ప మిగతా ఇరవై ఒక్క (21) ఆటగాళ్లు ఇరవై ఐదు ఏళ్ల లోపు వారే. కోచ్ యొక్క ఈ నిర్ణయం వల్ల భారత దేశ ఫుట్బాల్ అభిమానుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఇందుకు తోడు, మన జట్టు కెప్టెన్ అయిన సునీల్ ఛెత్రి మంచి ఫామ్ లో ఉన్నట్లుగా కనిపిస్తున్నాడు. అతడు ఇవాళ చేసిన వ్యాఖ్యలు జట్టు లోని మిగతా సభ్యులకు మంచి విశ్వాసాన్ని, ఇంకా పట్టుదలను పెంచాయి అనే మనం చెప్పుకోవాలి.
2011 వ సంవత్సరం లో చివరి సారిగా మన భారత దేశ ఫుట్బాల్ జట్టు ఏ.ఫ్.సి ఆసియన్ కప్ లో గొప్పగా ఆడలేదనే మనం చెప్పుకోవాలి. ఆనాడు జరిగిన టోర్నమెంట్ లో మన జట్టు గ్రూప్ దశ లోనే వెనుదిరిగి వచ్చేసింది.
ఆనాడు జరిగిన తప్పిదాలు మళ్లీ పునరావృతం కాకుండా ఈ సారి జరిగే ఆసియన్ కప్ లో ఎలాగైనా మన దేశ సత్తా చాటాలనే ఉద్దేశ్యం తోనే మన కోచ్ స్టీఫెన్ కాన్స్టాంటిన్ కేవలం యువతకే జట్టు లో ప్రాధాన్యం కలిగించాడు. ఈ నిర్ణయాన్ని సమర్ధించిన మన కెప్టెన్ ఛెత్రి, తమ సత్తా ఏంటో అంతర్జాతీయ స్థాయి లో రాబోతున్న ఆసియన్ కప్ లో తెలుస్తందని మీడియా కు వెల్లడించాడు.
“నేను ఇంకా గురుప్రీత్ సింగ్ తప్ప మన ఫుట్బాల్ జట్టు లో ఆడబోతున్న మిగతా ఇరవై ఒక్క సభ్యులకు కూడా ఈ ఆసియన్ కప్ మొదటిదే. ఇది వారందరికీ ఒక సువర్ణ అవకాశం గా నేను భావిస్తున్నాను. వారికి ఇది మంచి అనుభవాన్ని కూడా సంపాదించి పెడుతుంది,” అని ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అఫీషియల్ వెబ్సైట్ ప్రతినిధులకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో కోచ్ తీసుకున్న నిర్ణయం పై తన యొక్క భావనను వ్యక్తం చేసాడు.
జనవరి ఐదవ (5 వ) తారీఖున యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశం లో ప్రారంభం కానున్న ఈ ఏ.ఫ్.సి ఆసియన్ కప్ లో మొదటగా అబూ దాబి జట్టు బహ్రెయిన్ ఫుట్బాల్ జట్టు తో తలపడి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. అయితే, భారత ఫుట్బాల్ జట్టు యొక్క మొదటి మ్యాచ్ ఈ ఆదివారం నాడు అంటే జనవరి ఆరవ (6 వ) తేదీన జరగనుంది. మొదటి మ్యాచ్ లో భాగంగా మన జట్టు థాయిలాండ్ ఫుట్బాల్ జట్టు తో తలపడనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడు గంటలకు ప్రారంభం కానుంది.
సునీల్ ఛెత్రి యొక్క నేతృత్వం లోని మన భారత ఫుట్బాల్ జట్టు ఈ ఆసియన్ కప్ లో ఎలా రాణిస్తుందో అని మన దేశ ఫుట్బాల్ అభిమానులు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.