హాకీ వరల్డ్ కప్ 2018: న్యూజిలాండ్ ని చిత్తు చేసి క్వార్టర్స్ లో కి అడుగు పెట్టిన అర్జెంటీనా

Share this story



హాకీ వరల్డ్ కప్ 2018: అర్జెంటీనా ఎంతో సునాయాసంగా న్యూజిలాండ్ ని 3-0 తేడాతో ఓడించి గ్రూప్-A లో క్వార్టర్స్ లోకి అడుగు పెట్టే మొదటి జట్టు గా నిలిచింది. నిన్న, ఎంతో ఉత్కంఠ తో సాగిన ఈ గ్రూప్-A హాకీ సంగ్రామంలో గెలవడం ద్వారా అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్స్ లో తన చోటు ను పదిలం చేసుకుంది.ఈ ఉత్కంఠ భరితమైన మ్యాచ్ లో అర్జెంటీనా గెలవడానికి ఆ జట్టు లోని ముగ్గురు ఆటగాళ్లు అయినటువంటి అగస్టీన్ మజ్జిల్లి, లూకాస్ విల్లా మరియు లూకాస్ మార్టినేజ్ ఎంతో కీలకంగా వ్యవహరించారు. చివరకు తమ జట్టు ను ఆ ముగ్గురే విజయ తీరాలకు తీసుకెళ్లారు. ఇప్పుడు జరిగిన ఈ న్యూజిలాండ్ తో మ్యాచ్ ఒక ఎత్తయితే తమ తదుపరి మ్యాచ్ లో ఫ్రాన్స్ తో తలపడనుండటం అర్జెంటీనా కి మరొక ఎత్తు.

ప్రస్తుతం హాకీ వరల్డ్ కప్ లో ని గ్రూప్-A కి చెందిన అర్జెంటీనా జట్టు ఎంతో నేర్పుతో, నైపుణ్యం తో అద్భుతమైన ఆటను ప్రదర్శిస్తోంది. అర్జెంటీనా జట్టు ఇప్పటి వరకు ఆరు పాయింట్ లను సొంతం చేసుకుని గ్రూప్-A లో ముందంజలో కొనసాగుతోంది. అయితే ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లలో న్యూజిలాండ్ జట్టు కూడా తామేం తక్కువ కాదని నిరూపిస్తూ తమ సత్తా చాటుతూ వస్తున్నారు. న్యూజిలాండ్ జట్టు, జరిగిన అన్ని మ్యాచ్ లలో, మూడు పాయింట్ లను తమ ఖాతా లో వేసుకుని, గ్రూప్-A లో అర్జెంటీనా తర్వాత అంటే ద్వితీయ స్థానం లో కొనసాగుతున్నారు.

కళింగ స్టేడియం లో జరిగిన ఈ అద్భుతమైన మ్యాచ్ లో, ఒలింపిక్స్ ఛాంపియన్ అయినటువంటి ఆర్జెంటినా కి అగస్టీన్ మజ్జిల్లి, లూకాస్ మార్టినేజ్, ఇంకా లూకాస్ విల్లా – ఈ ముగ్గురి రూపం లో మూడు పాయింట్లు లభించాయి. ఆ మూడు పాయింట్లే జట్టు యొక్క విజయానికి తోడ్పడ్డాయి. ఇప్పటివరకు అర్జెంటీనా రెండు మ్యాచ్ లలో విజయం సాధించి ఆరు పాయింట్లు కొల్లగొట్టగా అందులోని మూడు పాయింట్లు చివరి రౌండ్ అయిన ఎనిమిదో రౌండ్ లో నే రావడం గమనార్హం.

అర్జెంటీనా మరియు న్యూజిలాండ్ జట్లు ఢీ అంటే ఢీ అంటున్న ఈ తరుణం లో స్పెయిన్ మరియు ఫ్రాన్స్ జట్లు చెరి ఒక పాయింట్ తో సరిపెట్టుకున్నాయి. స్పెయిన్ మరియు ఫ్రాన్స్ చెరి రెండు మ్యాచ్ లు ఆడినప్పటికీ, ఇప్పటి వరకు ఈ హాకీ ప్రపంచ కప్ లో తమ సత్తా ని చాటలేక పోయాయి. అందుకే ఆ రెండు జట్లు గ్రూప్-A విభాగం లో మూడు మరియు నాలుగు స్థానాలకే పరిమితం అయ్యాయి.

అర్జెంటీనా జట్టు తన తదుపరి గ్రూప్ మ్యాచ్ లో భాగంగా, ఈ గురువారం నాడు ఫ్రాన్స్ జట్టు తో తలపడ పోతోంది. అయితే, ఆ రోజు జరిగే మ్యాచ్ లో అర్జెంటీనా ఏ విధంగానైనా ఫ్రాన్స్ చేతిలో ఓటమి పాలైనా కూడా క్వార్టర్ ఫైనల్స్ కి చేరుకోవడం మాత్రం ఖాయం గా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా, న్యూజిలాండ్ జట్టు అదే రోజు అంటే డిసెంబర్ 6, గురువారం నాడు స్పెయిన్ తో తలపడటానికి సిద్ద పడుతోంది.

ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లలో ఈ నాలుగు జట్లు అర్జెంటీనా, న్యూజిలాండ్, స్పెయిన్, ఫ్రాన్స్ ఈ విధంగా తలపడ్డాయి – అర్జెంటీనా తమ మొదటి గ్రూప్ ఓపెనర్ మ్యాచ్ లో భాగంగా స్పెయిన్ తో తలపడింది. ఆ మ్యాచ్ లో అర్జెంటీనా, 4-3 తేడాతో స్పెయిన్ ను చిత్తుగా ఓడించింది. అదే విధంగా, న్యూజిలాండ్ కూడా తమ మొదటి మ్యాచ్ లో ఫ్రాన్స్ తో తలపడి, 2-1 తేడాతో ఆ మ్యాచ్ ను తన ఖాతా లో వేసుకుంది.