ఆసియన్ గేమ్స్ లో తన మ్యాచ్ ముగిసే సరికి భోజనాలు ముగిశాయని చెప్పి వివాదానికి తెరలేపిన శరత్ కమల్

Share this story


భారత దేశపు అత్యుత్తమ టేబుల్ టెన్నిస్ ఆటగాడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆచంట శరత్ కమల్ కొత్త వివాదానికి తెరలేపాడు. సోషల్ మీడియా లో 2018 వ సంవత్సరం లో తాను పాల్గొన్న ఆసియన్ గేమ్స్ లో తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని వెలిబుచ్చాడు. కేవలం బ్రెడ్, నూటెల్ల, ఇంకా ముసెలి ని మాత్రమే తాను భోజనం గా స్వీకరిస్తున్న ఒక చిత్రాన్ని తన స్వంత ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తన అనుచరులతో పంచుకున్నాడు. శరత్ కమల్ విడుదల చేసిన ఈ ఒక్క చిత్రం పెద్ద దుమారాన్నే సృష్టించిందని మనం చెప్పుకోవాలి.

“మేము ఆసియన్ గేమ్స్ లో పాల్గొన్న రోజుల్లో, మా ఆట ముగించుకుని భోజన శాల కి వచ్చే సరికే మొత్తం భోజనాలు అయిపోయేవి. మేము కేవలం బ్రెడ్, నూటెల్ల, ఇంకా మూసేలి ని మాత్రమే తిని సరిపెట్టుకునేవాళ్లం. మా మ్యాచ్ ముగిసే సరికి సుమారు రాత్రి పదకొండు గంటల ముప్పై నిముషాలు (11:30 pm) అయ్యేది. అంటే, మూడు గంటల పాటు ఎడతెరిపి లేకుండా మ్యాచ్ ఆడిన భారత ఆటగాళ్లకు కేవలం బ్రెడ్ ని మాత్రమే భోజనం గా పెట్టేవారు,” అని ఆచంట శరత్ కమల్ ఇండియా టుడే మీడియా ప్రతినిధులకు ఇచ్చిన ముఖా ముఖి లో భారత దేశ ఆటగాళ్లు ఆసియన్ గేమ్స్ లో ఎదుర్కున్న చేదు అనుభవాలను వెల్లడించాడు. మంచి డైట్ వలన ఒక ఆటగాడు తను పాల్గొనే మ్యాచ్ లలో మంచి క్రియాశీల పాత్రను పోషించగలడు,” అని వారికీ ఇచ్చిన ఇంటర్వ్యూ లో శరత్ కమల్ వివరించాడు.

2018 వ సంవత్సరం ఆగష్టు 26 వ తేదీన తమ కాంపెయిన్ ని ప్రారంభించిన భారత దేశ టేబుల్ టెన్నిస్ ఆటగాళ్లు, ఆసియన్ గేమ్స్ లో తమ సత్తా చాటి అందరి మెప్పు పొందారనే సంగతి మనకు తెలిసిన విషయమే. టీం మ్యాచ్ లలో భాగం గా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశ ఆటగాళ్లతో తలపడ్డ మన ఆటగాళ్లు ఆచంట శరత్ కమల్, సతియాన్ జ్ఞాన శేఖరన్, ఇంకా హర్మీట్ దేశాయ్ వారి వారి మ్యాచ్ లలో ప్రత్యర్థులను మట్టి కరిపించి అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించారు.

ఆచంట శరత్ కమల్ అయితే 11-9, 11-6, 11-5 పాయింట్ల తేడాతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి చెందిన అబ్దుల్లా ఆల్బా లూషి ని చిత్తు చిత్తు గా ఓడించి చరిత్ర సృష్టించాడు. అదే రోజు చైనా కు చెందిన తైపీ తో తలపడ్డ మన ఆటగాళ్లు మంచి ప్రదర్శన ఇచ్చినప్పటికీ ఓటమి పాలు కావాల్సొచ్చింది. ఆ రోజు చైనా ఆటగాళ్లతో రెండు మ్యాచ్ లలో తలపడ్డ శరత్ కమల్ ఒకదాంట్లో మంచి ఆట తీరును కనబరిచి విజయం సాధించగా మరో దాంట్లో ఓడిపోయాడు. హర్మీట్ దేశాయ్ ఏమో తన ఏకైక మ్యాచ్ లో మంచి విజయాన్ని నమోదు చేసుకోగా, సతియాన్ తన రెండు మ్యాచ్ లలో ఓటమి పాలయ్యాడు.

ఇక ఈ వివాదం విషయానికి వస్తే, ఆచంట శరత్ కమల్ చేసిన వ్యాఖ్యలని తోసిపుచ్చాడు ఆసియన్ గేమ్స్ లో మన భారత ఆటగాళ్ల చీఫ్ చెఫ్ అయిన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్. అయితే, భారత ఆటగాళ్లకు భోజనం దగ్గర మాత్రమే కాదు, వారికి ఇచ్చే గదులు కూడా పరిశుభ్రం గా ఉండవని చెపుతూ అక్కడ మన అథ్లెట్ లు ఎదుర్కున్న అగౌరవాన్ని గూర్చి శరత్ కమల్ ఇండియా టుడే ప్రతినిధులకు వివరించాడు. ఇంకా, మన దేశం లో టేబుల్ టెన్నిస్ ఆటకు ప్రాముఖ్యతను పెంచాల్సిన బాధ్యత ఒక్క ప్రభుత్వానిది మాత్రమే గాక మనందరి పైనా ఉంది అంటూ శరత్ కమల్ మీడియా కు స్పష్టం చేసాడు.