ఇంతకీ సచిన్ విరాట్ కోహ్లీ కి ఇచ్చిన ఆ సలహా ఏంటంటే, ఆట మొదలైన తరువాత మన ఓపెనర్లు వీలైనంత ఓపికగా ఆడుతూ కనీసం ముప్పై ఓవర్ ల వరకైనా ఆటను నెగ్గుకురావాలట. మన మొదటి ముగ్గురు బ్యాట్స్ మన్ ఈ విధంగా తమ స్ట్రైక్ రేట్ ని సమపాళ్లలో కొనసాగిస్తూ, కొంచెం కొంచెంగా పెంచుకుంటూ కనీసం ముప్పై ఓవర్ల వరకైనా అవుట్ కాకుండా నెగ్గుకు వస్తే ఆస్ట్రేలియా పై మన టీం గెలవడం ఎవరు కూడా ఆపలేరట.
ఇంకో అదిరిపోయే విషయం ఏంటంటే ఈ ఆస్ట్రేలియా vs ఇండియా సంగ్రామంలో మన ప్రత్యర్థి యొక్క అద్భుతమైన ఆటగాళ్లు మరియు బ్యాట్స్ మన్ అయినటువంటి స్టీవ్ స్మిత్ ఇంకా డేవిడ్ వార్నర్ లు ఆడటం లేదట. అయినా కూడా మిచెల్ స్టార్క్ మరియు పాట్ కమ్మిన్స్ రూపంలో భారత క్రికెట్ టీం కి గట్టి పోటీ ఎదురు కానుంది.
అయితే, సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీ కి ఈ సలహా ఇవ్వడానికి ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, మొదటి ముగ్గురు ఆటగాళ్లు ముప్పై ఓవర్ల వరకు నిలకడగా ఆడగలిగితే మిడిల్ ఆర్దర్లో ఉన్న ఆటగాళ్లకు పెద్దగా ఇబ్బంది కరంగా ఉండకుండా ఉంటుంది. ఈ విధంగా, భారత్ ఆస్ట్రేలియా పై గట్టి విజయం సాధించే అవకాశం ఉంటుంది.
ఆస్ట్రేలియా గడ్డ పై క్రికెట్ ఆడటం లో సచిన్ టెండూల్కర్ సిద్ధహస్తుడనే సంగతి మనకి తెలిసిన విషయమే. సచిన్ యొక్క అపారమైన అనుభవం ఇప్పుడు కెప్టెన్ విరాట్ కోహ్లీ కి ఎంత గానో ఉపయోగపడుతోంది. ఆస్ట్రేలియా గడ్డ పై క్రికెట్ ఆడటం అంటే మొదటి ముప్పై ఓవర్ లను చాలా కీలకంగా భావించాలని కూడా సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీ కి వివరించి ఉంటాడని మీడియా వర్గాల నుంచి సమాచారం అందుతోంది.
“ఆస్ట్రేలియా లో ఆడేటప్పుడు ఒకటి నుండి మూడు వికెట్లు మొదట్లోనే పడటం చాలా సాధారణం. ఎందుకంటే ఆస్ట్రేలియా బౌలర్లు ఆదిలోనే మన వికెట్లు తీయడం లో సిద్దహస్తులు. అందులోనూ, వారి గడ్డ పై ఆడటం వారికి ఎంతో సులువు మరియు అక్కడ పిచ్ కూడా వారికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇందువలన, మన మొదటి ముగ్గురు ఓపెనర్ బ్యాట్స్ మన్ లు మొదటి ముప్పై ఓవర్ లను కీలకంగా భావించి కచ్చితమైన నైపుణ్యాలను ప్రదర్శించి నిలకడగా ఆడుతూ ఆటను మన చేతుల్లోకి తీసుకోవాలి,” అని సచిన్ టెండూల్కర్ విరాట్ తో పేర్కొన్నట్లుగా స్పోర్ట్ స్టార్ అనే మీడియా సంస్థ వెల్లడించింది.
స్టీవ్ స్మిత్ ఇంకా డేవిడ్ వార్నర్ లు ప్రస్తుతం ఆస్ట్రేలియన్ క్రికెట్ టీం లో లేకపోవడం కూడా మన ఆటగాళ్లకు ఎంతో అనుకూలమని సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానించాడు. ఇదే అదునుగా భారత్ టీం కొంచెం కష్టంతో అయినా ఎలాగో అలా ఆస్ట్రేలియా లో నెగ్గుకు రాగలిగితే ఆ గడ్డ పై మొదటి టెస్ట్ సిరీస్ ని సొంతం చేసుకున్న వారవుతారు అని కూడా సచిన్ అభిప్రాయ పడ్డారు.
ఇదిలా ఉండగా ఆస్ట్రేలియన్ టీం తమ ఓపెనింగ్ బ్యాట్స్ మన్ అయినటువంటి డేవిడ్ వార్నర్ మరియు స్టీవ్ స్మిత్ లు లేక ఎంతో ఇబ్బంది పడుతోందని తెలుస్తోంది.