Share this story
వీరికి తోడు గా మన తెలుగు క్రికెట్ సూపర్ స్టార్ అంబటి రాయుడు కూడా ట్రైనింగ్ లో పాలుపంచుకున్నారు. అయితే, ఇదంతా ఒక ఆప్షనల్ ట్రైనింగ్ సెషన్ కావడం విశేషం. అంటే, ఎలాగైనా ఆస్ట్రేలియా పై జరిగే ఈ మొదటి వన్ డే ఇంటర్నేషనల్ పోరు లో తమ సత్తా చాటాలని మన క్రికెట్ టీం చాలా తాపత్రయం పడుతోందని సుస్పష్టంగా మనకు అర్ధం అవుతోంది.
మూడు మ్యాచ్ లుగా సాగనున్న ఈ వన్ డే ఇంటర్నేషనల్ సిరీస్, సిడ్నీ ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ లో ఈ జనవరి పన్నెండవ (12 వ) తారీఖున జరగనున్న మొదటి మ్యాచ్ లో ప్రారంభం కానుంది. అయితే, ఈ ఇరు జట్ల మధ్య రెండవ మ్యాచ్ జనవరి 15 వ తేదీన అడిలైడ్ లో జరగడానికి షెడ్యూల్ చేయబడగా, ఈ సిరీస్ లోని మూడవది మరియు చివరి మ్యాచ్ జనవరి 18 వ తేదీన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరగనుంది.
ఈ 2019 వ సంవత్సరం భరత క్రికెట్ జట్టు కి బాగానే కలిసి వచ్చిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే, మొన్న మన జట్టు సాధించిన టెస్ట్ సిరీస్ విజయం మామూలుది ఏం కాదండోయ్. ఇప్పటి వరకు ఆసియా ఖండం లో ఉన్న ఏ ఒక్క దేశం క్రికెట్ జట్టు కూడా ఆస్ట్రేలియా గడ్డ పై ఒక్క టెస్ట్ సిరీస్ ని కూడా గెలవలేకపోయింది అంటే నమ్మండి.
ఇప్పుడు ఆ ఘనతను సాధించిన ఏకైక దేశం గా, ఏకైక క్రికెట్ జట్టు గా భారత జట్టు చరిత్రలో నిలిచి పోయింది. అయితే, ఇదంతా మన అద్భుత ఛాంపియన్ అయినటువంటి విరాట్ కోహ్లీ కెప్టెన్సీ లో సాధించడం చెప్పుకోవాల్సిన విషయం. అందుకే, ఇప్పుడు అందరి కళ్లు విరాట్ కోహ్లీ సేన వరల్డ్ కప్ లో ఎలా ఆడతారో అన్నదాని పై కేంద్రీకృతం అయి ఉన్నాయి.
ఇక మన హెలికాప్టర్ షాట్ సృష్టి కర్త అయిన మహేంద్ర సింగ్ ధోనీ విషయానికి వస్తే, 2018 వ సంవత్సరం అతనికి పెద్దగా కలిసి రాలేదనే మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే, పోయిన సంవత్సరం లో జరిగిన ఇరవై వన్ డే ఇంటెర్నేషనల్స్ లో పాల్గొన్న మన ధోనీ కేవలం రెండు వందల డెబ్భై అయిదు (275) పరుగులు మాత్రమే సాధించాడు.
అయితే, ప్రస్తుతం జరగనున్న మ్యాచ్ లపై చాలానే ఫోకస్ చేస్తున్నట్లుగా కనిపిస్తున్నాడు మన ఆల్ రౌండ్ ఛాంపియన్. ఈ సంవత్సరం వరల్డ్ కప్ జరగనుండడం తో అందరి చూపు ఇప్పుడు మనోడి పై పడిందనే చెప్పుకోవాలి. 2014 వ సంవత్సరం లో ఆస్ట్రేలియా గడ్డ పై నుండి టెస్ట్ సిరీస్ కి స్వస్తి అంటే రిటైర్మెంట్ ప్రకటించిన ఎం.స్ ధోనీ, ఇప్పుడు ODI ఇంటెర్నేషనల్స్ కి తాను ఇంకా ఫిట్ గానే ఉన్నానని నిరూపించుకుని విమర్శకుల నోర్లు మూయించడానికి తాపత్రయ పడుతున్నాడు.