భారతీయ టెన్నిస్ లో ఇంకా కొనసాగుతున్న స్తబ్దత: 2018 మిగిల్చిన జ్ఞాపకాలు

Share this story



భారతీయ టెన్నిస్ లో ఇంకా స్తబ్దత కొనసాగుతూనే ఉంది. ఈ సంవత్సరం అంటే 2018 లో కొన్ని కొత్త ఆశలు చిగురించినప్పటికీ, ఇంకా నిరాశ, నిస్పృహల్లోనే మన దేశ టెన్నిస్ ఉందని చెప్పుకోవచ్చు. 2018 వ సంవత్సరం లో, భారత దేశ టెన్నిస్ ఆటగాళ్లలో కొద్ది మంది బాగానే రానించినప్పటికీ కూడా ప్రస్తుతం ఆ క్రీడలో నెలకొన్న అనిశ్చితి పూర్తిగా ఒక కొలిక్కి రావడం లేదు. ఎందుకంటే, ఈ సంవత్సరం లో కూడా పెద్దగా చెప్పుకోదగ్గ రీతిలో భారతీయ టెన్నిస్ అంతర్జాతీయ స్థాయిలో రానించ లేకపోయింది. లియాండర్ పేస్ వంటి గొప్ప ఆటగాళ్లు మన దేశం తరుపున ఆడుతున్నా ఇంకా ఏదో వెలితి మన దేశ టెన్నిస్ లో కనపడుతోంది. అదేంటంటే, భారత దేశం లో యువ టెన్నిస్ క్రీడా కారులు కరువయ్యారు. ఇదే బాధ ఇప్పుడు ఇండియన్ టెన్నిస్ ని తొలచి వేస్తోంది. ఒక్క యువ టెన్నిస్ క్రీడా కారుడైనా మన దేశం తరుపున ఆడి విశ్వ వేదిక పైన సత్తా చాటక పోవడమే ఇందుకు కారణం.

నలభై ఐదు సంవత్సరాలు నిండి ఉన్న లియాండర్ పేస్, మన దేశం తరుపున ఆడుతూ, అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చాటుతూ, విశ్వ వేదిక పై భారత్ యొక్క గౌరవాన్ని నలు దిక్కులా చాటుతున్నాడు. అయితే, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో, మన దేశం లో టెన్నిస్ కి ఇతడే ఏకైక దిక్కు అని ప్రతీ ఒక్క టెన్నిస్ అభిమాని భావిస్తున్నాడు. ఎందుకంటే, రిటైర్మెంట్ ప్రకటించే వయసులో కూడా టెన్నిస్ ఆటలో ఇంత బాగా రాణిస్తూ 2018 వ సంవత్సరం లో కూడా పతకాలు సాధించడమే లియాండర్ పేస్ యొక్క అద్భుతమైన క్రీడా స్ఫూర్తి కి నిదర్శనం. ప్రస్తుతం, భారత దేశం లో టెన్నిస్ అంటే లియాండర్ పేస్, లియాండర్ పేస్ అంటే టెన్నిస్ అనేంత గొప్ప పేరు ను పేస్ మన దేశం లో దక్కించుకున్నాడు.

లియాండర్ పేస్ తరహాలో మన దేశ టెన్నిస్ లో రాణిస్తున్న మరో అద్భుత ఆటగాడు ప్రజ్ఞేశ్ గున్నేశ్వరన్. ప్రజ్ఞేశ్ ఎందరో టెన్నిస్ క్రీడా కారులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ప్రజ్ఞేశ్ గున్నేశ్వరన్ గురించి ఎక్కడైనా మాట్లాడితే, అతడో పడి లేచిన క్రీడా కెరటం అనే పొగడ్తలు మీకు ముందుగా వినిపిస్తాయి. ఎందుకంటే, అతడు, ప్రస్తుతం, మోకాలి పగులు గాయాలతో ఎన్నో శస్త్ర చికిత్సలు చేయించుకున్నప్పటికీ టెన్నిస్ ఆటలో భారత దేశం తరుపున ఆడుతూ తన క్రీడా స్ఫూర్తి నీ, పట్టుదలను చాటుతూ యువ టెన్నిస్ క్రీడా కారులకు ఎంతో స్ఫూర్తి గా నిలుస్తున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న ఈ గొప్ప ఆటగాడు, ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్ లో నూట ఏడవ (107 వ) ర్యాంక్ ని కైవసం చేసుకుని యుకీ భంబ్రీ ఇంకా రామ్ కుమార్ రామ నాథన్ వంటి గొప్ప ఆటగాళ్లను వెనక్కి నెట్టి టెన్నిస్ లో మన దేశం లోనే మొదటి స్థానం లో కొనసాగుతున్నాడు.

టెన్నిస్ లో చెప్పుకోదగ్గ మరొక ఆటగాడు దివిజ్ శరన్. న్యూ ఢిల్లీ కి చందిన ఈ టెన్నిస్ ఆటగాడు ఈ సంవత్సరం లో చాలా బాగా రాణించి మన దేశానికి మంచి పేరు తెచ్చిపెట్టాడు. దివిజ్ శరన్, 2018 వ సంవత్సరంలో తన అద్భుతమైన ఆట ప్రదర్శన ద్వారా, రోహన్ బోపన్న వంటి అత్యద్భుత ప్లేయర్ ని సైతం వెనక్కి నెట్టి మన దేశం లో బెస్ట్ డబుల్స్ ప్లేయర్ గా పేరు తెచ్చుకున్నాడు. రోహన్ బోపన్న తో జత కట్టిన దివిజ్ ఈ సంవత్సరం జరిగిన ఆసియన్ గేమ్స్ మెన్స్ డబుల్స్ లో భారత్ కి ఒక స్వర్ణ పతాకాన్ని తీసుకొచ్చారు.