ఆస్ట్రేలియన్ ఓపెన్ 2019: సెకండ్ రౌండ్ లోకి దూసుకెళ్లిన నాదల్, షరపోవా

Share this storyపదిహేడు (17) సార్లు గ్రాండ్ స్లామ్ విజేత గా నిలిచిన రఫెల్ నాదల్ ఈ సంవత్సరం లో మొదటి టోర్నమెంట్ అయిన ఆస్ట్రేలియన్ ఓపెన్ లో మరో సారి తన సత్తా చాటి సెకండ్ రౌండ్ లోకి దూసుకెళ్లి తన అభిమానులకు రెట్టింపు ఉత్సాహం కలిగించాడు. ఆస్ట్రేలియా లో 2009 వ సంవత్సరం లో మెల్బోర్న్ పార్క్ లో జరిగినటువంటి గ్రాండ్ స్లామ్ కి ఛాంపియన్ గా నిలిచినటువంటి రఫెల్ నాదల్, ఆ దేశం లో టెన్నిస్ ఆట లో బాగా రాణిస్తున్నటువంటి డక్ వర్త్ ని పడగొట్టి రెండవ రౌండ్ లోకి అడుగు పెట్టాడు.అయితే, స్థానికం గా టెన్నిస్ ఆట లో మంచి గుర్తింపు ను సొంతం చేసుకున్న డక్ వర్త్ పై అక్కడి ప్రజలు ఇంకా అతని అభిమానులు చాలానే ఆశలు పెట్టుకున్నప్పటికీ, రఫెల్ నాదల్ యొక్క అనుభవం ముందు తను నిలవలేక పోయాడు. ప్రస్తుతం, డక్ వర్త్, టెన్నిస్ ప్రపంచ ర్యాంకింగ్స్ లో 238 వ స్థానం లో కొనసాగుతుండటం గమనార్హం.

సోమవారం నాడు ఆస్ట్రేలియా లో జరిగిన ఈ ఉత్కంఠ భరితమైన మ్యాచ్ లో 6-4, 6-3, 7-5 తేడాతో జేమ్స్ డక్ వర్త్ పై గెలిచి రఫెల్ నాదల్ తన యొక్క అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించాడు. అయితే, ఇప్పుడు రఫెల్ నాదల్ రెండవ రౌండ్ లో ఎవరితో పోటీ పడతాడో అని తన అభిమానులే కాక టెన్నిస్ విశ్లేషకులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు అన్న సంగతి మనకి తెలిసిన విషయమే.

ఆస్ట్రేలియా కు సంబంధించిన మాథ్యూ ఎబ్డెన్ ఇంకా జర్మనీ దేశం తరుపున ఈ టోర్నమెంట్ లో పాల్గొంటున్న జాన్ లెనార్డ్ స్ట్రఫ్ ఇద్దరు కూడా తమ తమ మొదటి రౌండ్ లో భాగం గా తలపడుతున్నారన్న సంగతి తెలిసిందే. అయితే, ఆస్ట్రేలియన్ ఓపెన్ కి సంబంధించిన షెడ్యూల్ ప్రకారం ఈ ఇరువురి మ్యాచ్ లో విజేత గా నిలిచే వ్యక్తే ఇప్పుడు రఫెల్ నాదల్ తో సెకండ్ రౌండ్ లో భాగం గా పోటీ పడనున్నాడన్నమాట.

ఇక మాజీ ఛాంపియన్ అయినటువంటి మరియా షరపోవా విషయానికి వస్తే, బ్రిటిష్ దేశ టెన్నిస్ క్రీడా కారిణి అయిన హారియట్ డార్ట్ తో ఆస్ట్రేలియన్ ఓపెన్ లో తన మొదటి రౌండ్ లో భాగం గా తలపడిన విషయం తెలిసిందే. అయితే, ఆమెను అంటే హారియట్ డార్ట్ ని చిత్తు చిత్తు గా ఓడించి రెండవ రౌండ్ లోకి అడుగు పెట్టింది షరపోవా. 6-0, 6-0 తేడా తో మరియా షరపోవా చేతిలో గోర పరాజయాన్ని చెవి చుసిన హారియట్ కొంత భావోద్వేగానికి గురై కోర్ట్ లోనే కంట నీరు పెట్టుకుంది.

రాడ్ లవెర్ అరేనా కోర్ట్ లో జరిగిన ఈ మ్యాచ్ లో కొంత భావోద్వేగ క్షణాలు చోటు చేసుకున్నాయి. కోర్ట్ మధ్యలోనే కంట నీరు పెట్టుకున్న ఇరవై రెండేళ్ల హారియట్ డార్ట్ ని రష్యన్ ఛాంపియన్ అయినటువంటి షరపోవా కొంత ఓదార్చింది. “కోర్ట్ లో నాకు అంత టైం లేకపోయింది. నేను నా ఈ కొన్ని సంవత్సరాల అనుభవం లో ఎన్నో సంఘటనలను ఎదుర్కొన్నాను. ఆస్ట్రేలియన్ ఓపెన్ లాంటి ఒక టోర్నమెంట్ లో మొదటి రౌండ్ చాలా కష్టం గా సాగుతుంది. నేను అలాంటి సందర్భాలను ఎదుర్కొన్నాను,” అని మరియా షరపోవా మీడియా కు వివరించింది.

ఇక మాజీ యూ.స్ ఓపెన్ ఛాంపియన్ అయినటువంటి స్లోన్ స్టీఫెన్స్ తన దేశానికే చెందిన టెన్నిస్ ఆటగాడు అయిన టేలర్ టౌన్ సెండ్ పై గెలిచి ఒక అదిరి పోయే విజయాన్ని తన ఖాతా లో వేసుకుని ఆస్ట్రేలియన్ ఓపెన్ లో రెండవ రౌండ్ కి చేరుకుంది.