Asia Cup: బంగ్లా చేతిలో చిత్తుగా ఓడిన లంక

ముష్ఫికర్ రహీమ్ అద్భుత బ్యాటింగ్‌కు.. బౌలర్ల సమష్టి ప్రదర్శన తోడుకావడంతో లంకేయులపై అద్భుత విజయం సాధించిన బంగ్లాదేశ్ ఆసియాకప్‌లో బోణీ చేసింది.

Share this story



సంచలనాలకు మారుపేరైన బంగ్లాదేశ్ఆసియాకప్‌ ప్రారంభ మ్యాచులో పూర్తిస్థాయిలో సత్తా చాటింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 137 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా 49.3 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక 35.2 ఓవర్లలో 124 పరుగులకే చాపచుట్టేసింది. బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్లలో ముష్ఫికర్‌ రహీమ్ భారీ శతకంతో రాణించడంతో శ్రీలంక ముందు మెరుగైన స్కోరును ఉంచారు. లంక బౌలర్లలో మలింగ 4 వికెట్లతో రాణించాడు.

ఆదుకున్న ముష్ఫికర్‌ రహీమ్
మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (2) రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరగగా.. మరో ఓపెనర్ లిట్టన్ దాస్ పరుగులేమి చేయకుండానే వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన షకిబుల్ హసన్ కూడా డకౌటయ్యాడు. ఆరంభంలోనే ముగ్గురు బ్యాట్స్‌మెన్స్‌ను కోల్పోయిన బంగ్లాను ముష్ఫికర్‌ రహీమ్ (144; 150 బంతుల్లో 11×4, 4×6) ఒంటరి పోరు చేసి శతకంతో జట్టును ఆదుకున్నాడు. మిథున్‌తో కలిసి మూడో వికెట్‌కు 136 బంతుల్లో 131 పరుగుల భాగస్వామ్యాన్ని రహీమ్ నెలకొల్పాడు.

38 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన లంక
262 పరుగలు విజయలక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన శ్రీలంకను బంగ్లా బౌలర్లు బెంబేలెత్తించారు. వరుస విరామాల్లో వికెట్లను తీస్తూ మ్యాచ్‌పై ఆదిపత్యం చెలాయించారు. 38 పరుగులకే 4 టాపార్డర్‌ వికెట్లను తీశారు. వంద పరుగుల్లోపే 8 వికెట్లను కోల్పోయిన లంక పరాజయాన్ని ఖాయం చేసుకుంది. దిల్‌రువాన్‌ పెరెరా(29), తరంగ (27) మినహా మరెవరూ రాణించకపోవడంతో 35.1 ఓవర్లలో 124 పరుగులకే శ్రీలంక జట్టు ఆలౌటైంది. లంక బ్యాట్స్‌మెన్లలో ఉపుల్‌ తరంగ (27), పెరీరా(29), లక్మల్‌(20), మథ్యూస్‌(16), కుశాల్‌ పెరీరా(11) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు.

స్కోరు బోర్డు:

* బంగ్లాదేశ్ బ్యాటింగ్: తమీమ్ ఇక్బాల్ నాటౌట్ 2, లిట్టన్ దాస్ (సి) మెండిస్ (బి) మలింగ 0, షకీబ్ (బి) మలింగ 0, ముష్ఫికర్ రహీమ్ (సి) మెండిస్ (బి) తిసారా పెరీరా 144, మిథున్ (సి) కుశాల్ పెరీరా (బి) మలింగ 63, మహ్మదుల్లా (సి) డిసిల్వా (బి) అపోన్సో 1, ఎం. హుస్సేన్ (సి) కుశాల్ పెరీరా (బి) మలింగ 1, మెహిది హసన్ (సి) అండ్ (బి) లక్మల్ 15, మోర్తజా (సి) తరంగ (బి) డిసిల్వా 11, రూబెల్ హుస్సేన్ ఎల్బీ (బి) డిసిల్వా 2, ముస్తాఫిజుర్ రనౌట్ 10.
ఎక్స్‌ట్రాలు: 12,
మొత్తం: 261 ఆలౌట్.
వికెట్లపతనం: 1-1, 2-1, 3-134, 4-136, 5-142, 6-175, 7-195, 8-203, 9-229, 10-261.
శ్రీలంక బౌలింగ్: మలింగ 10-2-23-4, లక్మల్ 10-0-46-1, అపోన్సో 9-0-55-1, తిసారా పెరీరా 7.3-0-51-1, దిల్రువాన్ పెరీరా 3-0-25-0, డిసిల్వా 7-0-38-2, షనక 3-0-19-0.

* శ్రీలంక బ్యాటింగ్: తరంగ (బి) మోర్తజా 27, మెండిస్ ఎల్బీ (బి) ముస్తాఫిజుర్ 0, కుశాల్ పెరీరా ఎల్బీ (బి) మెహిది హసన్ 11, డిసిల్వా ఎల్బీ (బి) మోర్తజా 0, మాథ్యూస్ ఎల్బీ (బి) రూబెల్ హుస్సేన్ 16, షనక రనౌట్ 7, తిసారా పెరీరా (సి) రూబెల్ హుస్సేన్ (బి) మెహిది హసన్ 6, దిల్రువాన్ పెరీరా (స్టంప్) లిట్టన్ దాస్ (బి) హుస్సేన్ 29, లక్మల్ (బి) ముస్తాఫిజుర్ 20, అపోన్సో (సి) (సబ్) నజ్ముల్ హుస్సేన్ (బి) షకీబ్ 4, మలింగ నాటౌట్ 3,
ఎక్స్‌ట్రాలు: 1.
మొత్తం: 35.2 ఓవర్లలో 124 ఆలౌట్.
వికెట్లపతనం: 1-22, 2-28, 3-32, 4-38, 5-60, 6-63, 7-69, 8-96, 9-120, 10-124.
బంగ్లాదేశ్ బౌలింగ్: మోర్తజా 6-2-25-2, ముస్తాఫిజుర్ 6-0-20-2, మెహిది హసన్ 7-1-21-2, షకీబ్ 9.2-0-31-1, రూబెల్ హుస్సేన్ 4-0-18-1, మొసద్దెక్ హుస్సేన్ 3-0-8-1.