భారతీయ వెయిట్ లిఫ్టర్ లకు ఓ గొప్ప మైలురాయి గా నిలిచిన 2018 వ సంవత్సరం

Share this story






2018 వ సంవత్సరం, భారతీయ వెయిట్ లిఫ్టింగ్ ఆటగాళ్లకు ఓ గొప్ప అనుభూతిని, ఆనందాన్ని, అన్నింటికీ మించి గౌరవాన్ని తెచ్చి పెట్టింది అని చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే, ఈ సంవత్సరం లో, మరొక యువ కెరటం, వెయిట్ లిఫ్టింగ్ ద్వారా మన దేశ గౌరవాన్ని నలు దిక్కులా చాటి చెప్పాడు. ఈ ఏడాది జరిగిన కామన్ వెల్త్ గేమ్స్ లో తన సత్తా చాటాడు. ఇంకా, మీరాబాయి చాను లాంటి గొప్ప వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులు దేశానికి స్వర్ణ పతకాలను తెచ్చి పెట్టారు. అందుకే, ఈ సంవత్సరం భారతీయ క్రీడలకు, మరీ ముఖ్యం గా చెప్పాలంటే భారత వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులకు ఎన్నో అద్బుతమైన క్షణాలను మిగిల్చి వెళ్తోందని చెప్పుకోవాలి.

ఒకరిద్దరు ఆటగాళ్లు డోపింగ్ టెస్ట్ లో విఫలం కావడం లాంటి కొన్ని సంఘటనలు, మన దేశానికి మచ్చ తెచ్చి పెట్టినా కూడా, మనం గెలిచిన స్వర్ణ, కాంస్య పతకాలు, భారత దేశ కీర్తి ని పెంచాయి. ఇంకా చెప్పాలంటే, వెయిట్ లిఫ్టింగ్ లో ఒలింపిక్స్ లో కానీ కామన్ వెల్త్ గేమ్స్ లో కానీ పతకాల వేటలో ఎప్పుడూ వెనకపడి పోయే మన ఆటగాళ్లు, ఈ సంవత్సరం మాత్రం, అద్భుతమైన ప్రదర్శనలతో ప్రపంచానికి సత్తా చాటి చెప్పారు.

పదహారేళ్ల వయసున్న జెరెమీ లాల్ రిన్నుంగా, మన దేశానికి 2018 యూత్ ఒలింపిక్ క్రీడలలో వెయిట్ లిఫ్టింగ్ ఆటలో స్వర్ణ పతాకాన్ని సాధించి పెట్టి చరిత్రలో నిలిచిపోయాడు. ఎందుకంటే, భారత దేశానికి, ఒలింపిక్స్ లో వెయిట్ లిఫ్టింగ్ ఆటలో స్వర్ణ పతకం రావడం ఇదే తొలిసారి. ఇంతకంటే గొప్ప విషయం ఈ సంవత్సరం లో ఏముంటుంది చెప్పండి. ఒక పదహారేళ్ల బాలుడు ఇలాంటి కనీ వినీ ఎరుగని రీతిలో భారత దేశానికి ఒక ఆటలో స్వర్ణ పతాకాన్ని తీసుకు రాగలుగుతాడని ఎవరు మాత్రం ఊహిస్తారు చెప్పండి. అందుకే, భారత క్రీడాకారులు అందరు కూడా ఈ ఏడాది లోనే వెయిట్ లిఫ్టింగ్ ఆటకి ఒక మంచి గుర్తింపు వచ్చిందనీ, ఒక గొప్ప దశ వచ్చిందని భావిస్తున్నారు.

ఇక, మళ్లీ ఈ పదహారేళ్ల యువ వెయిట్ లిఫ్టర్ విషయానికి వస్తే, జెరెమీ లాల్ రిన్నుంగా అనే ఈ బాలుడు ఇరవై ఆరు (26) అక్టోబర్ 2002 వ సంవత్సరం లో మిజోరాం రాష్ట్ర రాజధాని అయినటువంటి ఐజ్వాల్ లో జన్మించాడు. ఈ యువ క్రీడాకారుడు, 2018 వేసవి లో జరిగినటువంటి సమ్మర్ యూత్ ఒలింపిక్స్ లో భారత దేశం తరుపున వెయిట్ లిఫ్టింగ్ కి ప్రాతినిధ్యం వహించడమే గాక, అరవై రెండు కేజీ ల (62 KG) విభాగం లో మన దేశానికి మొదటి స్వర్ణ పతాకాన్ని సాధించి పెట్టాడు.

ఇక, సైకోమ్ మీరాబాయి చను విషయానికి వస్తే, తను 2018 కామన్ వెల్త్ ఆటలలో ఒక అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించి తన సత్తా చాటింది.ఈ సంవత్సరం, మన దేశానికి కామన్ వెల్త్ గేమ్స్ లో మొదటి స్వర్ణ పతాకాన్ని తెచ్చి పెట్టింది. మీరాబాయి, ఇప్పటికే ఎన్నో వరల్డ్ ఛాంపియన్ షిప్ లను, ఇంకా కామన్ వెల్త్ పతకాలను సొంతం చేసుకొంది. ఎన్నో సంవత్సరాల నుంచి తాను చేస్తున్న కృషికి ఇప్పుడు మంచి ఫలితం దక్కిందని మీరాబాయి చను వెల్లడించింది. తను చేసిన సేవలకు గాను భారత దేశ ప్రభుత్వం, మీరాబాయి చను ను ఈ ఏడాది ఎంతో గౌరవ ప్రదమైన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారాన్ని బహుకరించింది.
కామన్ వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి సంజితా చను, ఈ ఏడాది జరిగిన డోప్ టెస్ట్ లో విఫలం అవ్వడం దేశ క్రీడా లోకాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది.