బంగ్లా చేతిలో ఓటమి.. ఊపిరి పీల్చుకున్న పాక్ ఫ్యాన్స్

ఆసియా కప్‌లో చెత్త ప్రదర్శన చేసిన పాకిస్థాన్ జట్టు బంగ్లా చేతిలో ఓడి ఫైనల్ చేరకుండానే టోర్నీ నుంచి వైదొలిగింది. దీంతో పాక్ ఫ్యాన్స్ వెరైటీగా పంచ్‌లేస్తున్నారు.

Share this story


ఆసియా కప్‌లో పాకిస్థాన్‌ను మట్టి కరిపించిన బంగ్లాదేశ్ ఫైనల్ చేరింది. భారత్‌తో తుది పోరుకు ఆ జట్టు సిద్ధమైంది. ఓ మాదిరి లక్ష్యాన్ని చేధించే క్రమంలో పాక్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో 240 పరుగుల టార్గెట్‌‌తో బరిలో దిగిన పాక్.. 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 202 పరుగులు మాత్రమే చేసింది. గత నాలుగేళ్లలో బంగ్లా జట్టు ఆసియా కప్ ఫైనల్ చేరడం కావడం విశేషం. 2015 నుంచి పాక్, బంగ్లా మధ్య 4 వన్డేలు జరిగితే.. అన్నింట్లోనూ బంగ్లాదేశ్ జట్టే విజయం సాధించింది.

బంగ్లాదేశ్ చేతుల్లో చిత్తుగా ఓడిన తమ జట్టుపై పాక్ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. సర్ఫరాజ్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. 95 మ్యాచ్‌లు ఆడిన అతడు చేసింది రెండు సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు మాత్రమే.. అలాంటి ఆటగాడు జట్టును నడిపిస్తున్నాడు. అమేజింగ్.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.
భారత్‌ చేతిలో మూడో ఓటమిని తప్పించుకోవడం ఎలా? బంగ్లాదేశ్ లాంటి పసికూన చేతిలో ఓడితే సరిపోతుంది. ఈవిధంగా పాకీ భారత్ చేతుల్లో ఓటమిని తప్పించుకుంది. వాళ్లు ఈ ఫలితాన్ని ఎంజాయ్ చేస్తున్నారని వ్యంగ్యంగా ట్వీట్లు చేస్తున్నారు.
థాంక్యూ అల్లా.. భారత్ చేతుల్లో వరుసగా మూడో ఓటమిని తప్పించావ్ అంటూ పాక్ ఫ్యాన్స్ నిర్వేదంతో ట్వీట్లు చేస్తున్నారు.