మరింత నేర్పుతో విరాట్ భారత్ యొక్క అత్యుత్తమ కెప్టెన్ కాగలడు: సునీల్ గవాస్కర్

నాలుగవ టెస్ట్ సిరీస్, నాలుగవ రోజు ఆట ముగిసే సరికి జట్ల స్కోర్ లు ఈ విధంగా ఉన్నాయి: భారత క్రికెట్ జట్టు ఆరు వందల ఇరవై రెండు (622) రన్స్ ని తన ఖాతా లో వేసుకుంది (చేతేశ్వర్ పుజారా నూట తొంభై మూడు 193 పరుగులు, పంత్ నూట యాభై తొమ్మిది 159 పరుగులు నాట్ అవుట్, జడేజా ఎనభై ఒక్క పరుగులు సాధించారు). ఆస్ట్రేలియా కు చెందిన బౌలర్ లియోన్ నూట డెబ్భై ఎనిమిది పరుగులకు గాను భారత్ యొక్క నాలుగు వికెట్లను పడగొట్టాడు.

ఇక ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు విషయానికి వస్తే, ఆ జట్టు ఆట ముగిసే సమయానికి రెండు వందల ముప్ఫై ఆరు 236 పరుగుల ను తన ఖాతా లో వేసుకోగలిగింది. (హార్రీస్ డెబ్భై తొమ్మిది 79 పరుగులు, హాండ్స్ కొమ్బ్ ఇరవై ఎనిమిది 28 పరుగులు నాట్ అవుట్, ఇంకా కమ్మిన్స్ ఇరవై ఐదు నాట్ అవుట్ గా నిలిచారు). మన భారత క్రికెట్ జట్టు కు ఎంతో బాగా తోడ్పడుతున్న బౌలర్ అయినటువంటి కులదీప్ యాదవ్ నాలుగవ రోజు కూడా తన సత్తా చాటి ఆస్ట్రేలియా కి చుక్కలు చూపించాడు. మన ప్రత్యర్థి జట్టు కి కేవలం డెబ్భై ఒక్క పరుగులను మాత్రమే ఇచ్చి మూడు వికెట్ల ను పడగొట్టి అందరి మెప్పు పొందాడు.

ప్రస్తుత సమయానికి ఆటను గనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే, టిమ్ పైన్ సారధ్యం లోని ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మన భారత క్రికెట్ జట్టు కంటే మూడు వందల ఎనభై ఆరు 386 పరుగుల తేడాతో వెనకపడి ఉంది. ఈ టెస్ట్ సిరీస్ ని విశ్లేషిస్తున్న సునీల్ గవాస్కర్ మరియు మైఖేల్ క్లార్క్ లు, విరాట్ కోహ్లీ కెప్టెన్ గా టిమ్ పైన్ పై తన యొక్క ఆధిపత్యాన్ని ఈ టెస్ట్ సిరీస్ లో గొప్ప గా ప్రదర్శించాడని మీడియా కు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. “భారత్ యొక్క ఆటగాళ్లు విరాట్ కోహ్లీ యొక్క సారధ్యం లో ఆడటానికి ఇష్టపడటమే, అతన్ని ఒక అత్యుత్తమ కెప్టెన్ గా తీర్చి దిద్దుతోంది,” అని తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేసాడు ఆస్ట్రేలియా కు చెందిన సీనియర్ క్రికెటర్ స్టీవ్ వాఘ్.

సునీల్ గవాస్కర్ విరాట్ కోహ్లీ యొక్క అద్భుతమైన ప్రదర్శనల కు ఫిదా అయినట్లు మనకు అర్ధం అవుతోంది. పోయిన ఏడాది నుంచి విరాట్ కోహ్లీ ఒక కెప్టెన్ గా మంచి ఫామ్ ని ప్రదర్శిస్తున్నాడని, ఆ ఫామ్ ని అలాగే కొనసాగిస్తే విరాట్ భారత్ యొక్క అత్యుత్తమ కెప్టెన్ ల లిస్ట్ లో చేరిపోతాడని సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు. విరాట్ కోహ్లీ యొక్క మంచి ఫామ్ భారత జట్టు కు ఎంతో మేలు చేస్తుందని, ఈ ఏడాదిలో జరిగే వన్ డే ప్రపంచ కప్ కూడా మన సొంతం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

విరాట్ యొక్క ఆన్ ఫీల్డ్ డెసిషన్స్ తన ను ఇంప్రెస్ చేసాయని చెప్పుకొచ్చాడు మైఖేల్ క్లార్క్. ముఖ్యం గా ఆస్ట్రేలియా బ్యాట్స్ మాన్ అయిన మార్నస్ వికెట్ తీయడానికి విరాట్ ఫీల్డర్ లను సెట్ చేసిన విధానం తనకు బాగా నచ్చిందని మైఖేల్ క్లార్క్ మీడియా కు వెల్లడించాడు. అయితే, ఆస్ట్రేలియా తో తలపడ్డ మునుపటి మ్యాచ్ లలో, విరాట్ కోహ్లీ ఎదుర్కున్న అపజయాలే ఇప్పుడు అతన్ని, అతని టీం ని విజయానికి చేరువ చేశాయని క్లార్క్ అభిప్రాయపడ్డాడు.
విరాట్ కోహ్లీ కెప్టెన్సీ లో భారత క్రికెట్ జట్టు ఈ సారి జరిగే ప్రపంచ కప్ లో ఎలా రాణిస్తుందో అని ప్రతీ ఒక్క అభిమాని ఎదురు చూస్తున్నాడు.